మదనపల్లె పట్టణంలోని మద్యం దుకాణాల వద్ద గురువారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ భీమలింగ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణాల వద్ద ధరల పట్టికలను సిబ్బందితో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. మదనపల్లె ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల వద్ద, షాపుల యజమానులు విధిగా ప్రభుత్వ నిబంధనల మేరకు మధ్యం ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.