బీటీ కాలేజీ ఎంక్వైరీ కమిటీ నివేదిక బయట పెట్టండని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ గురువారం అర్జెడి ని డిమాండ్ చేయారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. గతంలో బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తున్నట్టు విడుదలైన జీవో అనంతరం ప్రభుత్వం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను కోరిందన్నారు, అప్పుడు ఉన్న కరస్పాండెంట్ అవినీతికి పాల్పడుతూ అధికార ప్రలోభాలకులోనై కనీస అర్హతలేని జాబితాను పంపారని తెలిపారు.