మదనపల్లె అంకిశెట్టిపల్లి వద్ద బుద్ధుడి విగ్రహం ధ్వంసం ఘటనపై సిట్ తో సమగ్ర విచారణ జరపాలి. అలాగే జిల్లా ఎస్పీ బుద్ధ విగ్రహం ధ్వంసం విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడాన్ని ఖండిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ తెలిపారు. బుద్ధుడి విగ్రహం ధ్వంసం ఘటనపై శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ అసలు వాళ్ళని వదిలి అమాయకులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు.