మదనపల్లి: అనారోగ్యం తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం

అనారోగ్యం తాళలేక విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మదనపల్లి తాలూకా ఎస్సై చంద్రమోహన్ శుక్రవారం తెలిపారు. మదనపల్లి మండలంలోని పూతబోలుకు చెందిన సాగర్ రెడ్డి భార్య కృష్ణవేణి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్