ఎస్టీ సాధనకు వాల్మీకులు పార్టీలను పక్కనపెట్టి ఏకం కావాలని వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు ఆదివారం మదనపల్లెలో పిలుపునిచ్చారు. ఏళ్ళ తరబడి వివిధ రాజకీయ పార్టీలు వాల్మీకులను వాడుకుని ఓటు బ్యాంక్ తో అధికారం లేక వచ్చి ఆ తర్వాత వాల్మీకిలను పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయలు ఒక్కతాటిపై నిలబడి ఎస్టీ జాబితాలోకి చేర్చే వరకు పోరాటాలు చేద్దామన్నారు.