రామసముద్రం మండల స్థానిక ఎస్సై రమేష్ బాబు, ఇంటిలిజెన్స్ ఎస్సై శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 20 వాహనాలకు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ వాహనాలకు నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా ఉంచుకోవాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర పెట్టుకోవాలని, హెల్మెట్ తప్పక ధరించాలని తెలిపారు.