రామసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల మండలస్థాయి కమిటీ ఎన్నిక జరిగింది. ఎంపీడీవో గఫూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలో కమిటీ అధ్యక్షుడిగా మునిస్వామి నాయక్, ఉపాధ్యక్షుడిగా రెడ్డి శేఖర్, కోశాధికారిగా లత, ప్రసన్న, ప్రధాన కార్యదర్శిగా మారప్ప, మీడియా ప్రతినిధిగా రెడ్డి శేఖర్ ఎన్నికయ్యారు.