నగరి నియోజకవర్గం, కూనమరాజుపాళెంలో వున్న శ్రీ గీతామందిర ఆశ్రమంలో గురువారంనాడు విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి అయిన పుండరీక వరదానంద స్వామి వారికి ఆశ్రమ భక్తులు గురుపూజ నిర్వహించారు. ముందుగా పాద పూజ చేసి నూతన వస్త్రములు సమర్పించారు. అనంతరం పూలదండలతో సత్కరించి ఫల పుష్పాలు సమర్పించారు. విచ్చేసిన భక్తులకు స్వామీజీ ఆశీస్సులు అందజేసి తమచేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ చేశారు.