బుధవారం నగరి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి కాంచీపురం వెళ్తున్న ధాన్యం లోడుతో ఉన్న లారీ, రాజీవ్ నగర్ సబ్స్టేషన్ వద్ద వన్ వేలో వెళుతుండగా, ఎదురుగా వచ్చిన కారును తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.