నగరిలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల కోసం పోరాడుతోందని తెలిపారు. కార్మికుల సంక్షేమ చట్టం ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలతో పోలిస్తే కార్మికుల వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దశలవారీగా పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు.