ఈనెల 23 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్యా పిలుపునిచ్చారు. గురువారం నగరిలో పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సభల విజయానికి జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ మహాసభలు సీపీఐ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.