నగరి నియోజకవర్గం, నగిరి రూరల్ మండలం, తెరని గ్రామంలో శనివారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూటమి ప్రభుత్వం వేగవంతంగా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.