నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు మరియు హరికథా గానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు శ్రీమతి తులసీబాయి, శ్రీమతి రమ్యకృష్ణ మరియు హరి మధుసూధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, నగరిలో జరిగింది.