కూనమరాజుపాళెంలో వైభవంగా జరిగిన పౌర్ణమి పూజలు

నగరి నియోజకవర్గం, కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు గురువారం వ్యాస పూర్ణిమ పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము చేపట్టారు. లోకకళ్యాణాని కాంక్షిస్తూ హోమం చేశారు. అనంతరం అమ్మవారికి పంచహారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పుండరీక వరదానంద స్వామి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్