కూనమరాజుపాళెంలో మాఘపూర్ణిమ వేడుకలు

నిండ్ర మండలం, కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం మాఘపూర్ణిమ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి, శ్రీ లక్ష్మీ నారాయణ ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వేదపండితులు రూపేష్ క్రిష్ణ ఆచార్య ఆధ్వర్యంలో 108 గులాబీ పుష్పాలతో శ్రీ సూక్త మహాలక్ష్మీ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామార్చన గావించి పంచహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాలు నగరి నియోజకవర్గంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్