పుత్తూరు పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన మధువర్మ(47) అనే వ్యక్తి, కొన్నాళ్లుగా తరచూ కడుపునొప్పితో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.