భారీ వర్షాల నేపద్యంలో మూలకోన వాటర్ ఫాల్స్ మూసివేత

పుత్తూరు పరిధిలోని మూలకోన వాటర్ ఫాల్స్ ను భారీ వర్షాలు, మొంథా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సోమవారం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్