నగరి: సంఘమిత్రలకు 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ

నగరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 149 సంఘమిత్రలకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం సెల్ఫోన్లను పంపిణీ చేశారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో నగరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, క్షేత్రస్థాయిలో విధులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా మహిళలు సమాజంలో మరింత వేగంగా ఎదగగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీపీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్