నగరి: 24 గంటల్లో సీఎం సహాయ నిధి మంజూరు

నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగకు చెందిన గంగాధర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదివారం రూ. 6 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే భాను ప్రకాష్ రెఫరల్ లెటర్‌తో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఈ మొత్తం మంజూరైంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగాధర్‌కు ఈ ఆర్థిక సహాయం నేరుగా ఆసుపత్రికి అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే భానుకు గంగాధర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్