కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. నగరిలో మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు పనిచేయాలని ఆయన సూచించారు.