చిత్తూరు, నగరిలోని జామియా మసీదు జమాత్ వాళ్లు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వర్క్ బోర్డు ఇన్సిపెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, కొంతమందితో దొంగ కమిటీ వేసి, అధికారుల అండదండలతో జామియా మసీదును స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని, జామియా మసీదుతో సంబంధం లేని, పుత్తూరు మసీదుకు చెందిన వ్యక్తులకు కమిటీ సభ్యులుగా ఎలా అవకాశం కల్పిస్తారని, రామ్నగర్లోని మదీనా మసీదు అధ్యక్షుడిని నగరి జామియా మసీదు అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జామియా మసీదు కొత్త కమిటీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.