నగరి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ అమ్మకాలు అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు పోలీసులు సహకారంతో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా శనివారం డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజిత్ కలిసి మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి పలు దుకాణాలలో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా సుమారు 100 కేజీలు నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని జరిమానా విధించినట్లు తెలిపారు.