నగరి పరిధిలోని కుశస్థలి నదిలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో కీళ్లపట్టులో మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక నాయకులు బుధవారం తెలిపారు. గత ఏడాది నాలుగు సార్లు వరదల్లో కొట్టుకుపోయిన ఈ రోడ్డు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ప్రస్తుతం సిమెంట్ కంకరతో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.