నగరి: బి ఆర్ నాయుడు పై మండిపడ్డ రోజా

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం నగరిలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పవిత్రమైన ఛైర్మన్ పదవిని నాయుడు అపహాస్యం చేశారని ఆరోపించారు. ఆయన ఎప్పుడూ టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించలేదని, చంద్రబాబు మెప్పుకోసం పనులు చేస్తూ, వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. క్విడ్ ప్రో కో కింద ఆయనకు పదవి దక్కిందని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని రోజా అన్నారు.

సంబంధిత పోస్ట్