కూటమి ప్రభుత్వ ధ్యేయం లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమేనని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు. శనివారం పుత్తూరు మున్సిపాలిటీ, పిల్లారి పట్టులో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.