నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ పథకం అమలు నేపథ్యంలో పుత్తూరు పవర్లూమ్ కార్మికులు బుధవారం రాత్రి ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారని, చేనేత కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.