ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.