నగరి: ఆ ఎమ్మెల్యే పై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు: రోజా

మాజీ మంత్రి రోజా గురువారం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదని మాట్లాడుతున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. ఆ ఎమ్మెల్యేను టీటీడీ మెంబర్‌గా కొనసాగించడంపై సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు కాపాడడమే తమ లక్ష్యమని చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్