చిత్తూరు జిల్లా, నగిరి పట్టణంలో రంగు నీళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ పట్టణ కార్యదర్శి వేలన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం పట్టణంలో పర్యటించారు. పైపులలో రంగు నీళ్ళు లీక్ అవుతున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను అధికారులు వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు.