నగిరి: సాయిబాబా ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు

నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని టీబీ రోడ్డులో గల షిరిడి సాయిబాబా ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సాయిబాబాకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి ఉదయం 4: 30 నుండి 10 గంటల వరకు స్వామివారికి భక్తులు పాలాభిషేకం చేయవచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్