నగిరి: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా, నగిరి మున్సిపాలిటీ, కీళ్ల పట్టు బీసీ కాలనీ నందు వెలసిన సెల్వ వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ప్రధాని గోపురానికి ఎమ్మెల్యే నదీ జలాభిషేకాలను చేశారు.

సంబంధిత పోస్ట్