నగిరి: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

నగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ప్రజలు బుధవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలని అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి అందజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే వెంటనే ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్