నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షిక తిరుణాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలు, కామధేను వాహనం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.