కుష్ఠువ్యాధి నివారణ అందరి బాధ్యత: వెంకమరాజు

విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం, మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా స్పర్శ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్ఠువ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని HM వెంకమరాజు పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బంది వినోలియా మాట్లాడుతూ, కుష్ఠువ్యాధి బాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అని, చర్మంపై స్పర్శ లేకున్నా తెల్ల మచ్చలున్నా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్