నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగలో జరిగిన టి 10 క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యువత చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.