నగరి నియోజక వర్గం, పుత్తూరు పట్టణంలోని ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి ఆలయంలో వార్షికోత్సవ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు అయిన శుక్రవారం గోపూజ, గరిక పూజ, పోతురాజు ఊరేగింపు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహానికి భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన పాలతో అభిషేకాలను నిర్వహించారు.