పుత్తూరు: అత్త మందలించిందని కోడలు బలవన్మరణం

పుత్తూరులో శనివారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. షోలింగర్కకు చెందిన స్నేహ(22)కు 2023లో గేటుపుత్తూరు పిళ్లారిపట్టు వీధికి చెందిన డానియేలుతో వివాహమైంది. దంపతులకు ఏడాది వయసు పాప ఉంది. అత్తతో మనస్పర్థల మధ్య స్నేహ గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్