ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడటమే వైఎస్సార్సీపీ లక్ష్యమని మాజీ మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పుత్తూరు రూరల్ మండలంలోని ఉత్తరపు కండ్రిక, కనకంపాలెం పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవీంద్ర, పార్టీ నాయకులు, బిఎల్ఎ లతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.