గుడిపాల ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

చిత్తూరు సమీపంలోని గుడిపాల భద్రకాలియమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్‌పై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు. బొమ్మసముద్రం జాతరకు వెళ్తున్న వీరి బైకులు ఢీకొన్నాయి. ప్రభాస్ (23) పరిస్థితి విషమంగా ఉండగా, ధనుష్, నితిన్, అజిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో సీఎంసీ చీలాపల్లికి తరలించారు. హిందూపురం, కర్నూలు ప్రాంతాల నుంచి చిత్తూరు వైపు బొమ్మసముద్రం జాతర కోసం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్