నగిరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న 300 మంది ప్రజలు 15 సంవత్సరాలు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య సోమవారం తెలిపారు. ఈ సమస్యపై వారు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో డ్రైనేజీ కాలువలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.