వడమాలపేట: వడదెబ్బతో కార్మికుడి మృతి

, వడమలపేట మండలం, పాత ఎస్టీ కాలనీకి చెందిన కిషోర్ (40) అనే కూలీ మంగళవారంవడదెబ్బతో మృతి చెందాడు. కూలీ పనులకు వెళ్ళిన కిషోర్, ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై, రక్తపు వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్