విజయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లకు 'విద్యాంజలి 2.0' కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేయాలని, గ్రామాల్లోని విజ్ఞానవంతుల నుంచి జ్ఞానాన్ని, పూర్వవిద్యార్థుల నుంచి సామాగ్రి, పరికరాల రూపంలో సహకారం పొందవచ్చని ఏంఈఓ హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సీఆర్సీ కార్యదర్శి, రిసోర్స్ పర్సన్, ఉపాధ్యాయులు, కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.