విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు విశ్రాంత ఉపాధ్యాయులు ఎరుకలయ్య శ్రీమతి లలితమ్మ దంపతులు కుర్చీలు వితరణగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజుకు శుక్రవారం అందచేశారు. పూర్వవిద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని మండలావిద్యాశాక అధికారి హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. దాతలను విద్యాకమిటి సభ్యులు సత్కరించారు.