పుత్తూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న గౌడ వైన్స్ మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కాలనీ పరిసరాల్లో మద్యం దుకాణం తెరవడం వల్ల కుటుంబాల పతనం, యువత భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడే ప్రమాదం ఉందని పేర్కొంటూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో చేరి 'మా కాలనీలో మద్యం దుకాణం వద్దు, పిల్లల భవిష్యత్తు చెడగొట్టే దుకాణాలు వద్దు' అంటూ నినాదాలు చేశారు.