పలమనేరు ఎస్ వి సి ఆర్ డిగ్రీ కాలేజ్ వద్ద, పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం 5కె రన్ నిర్వహించి, పట్టణ ప్రజలకు జనాభా లెక్కల నమోదుపై అవగాహన కల్పించారు. మే 1వ తేదీ నుండి అధికారులు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ (se.census.gov.in) ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పలమనేరును శుభ్రంగా ఉంచడంలో అందరూ సహకరించి, కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు పొందేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, పట్టణ ప్రజలు, పరిరక్షణ సమితి సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.