బుధవారం, 8 ఏప్రిల్ 2026న పలమనేరు ఎస్ వి సి ఆర్ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ ద్వారా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో శిక్షణ పొందిన 74 మంది విద్యార్థులకు ప్రిన్సిపల్ వెంకటేశులు సర్టిఫికెట్లు అందజేశారు. ఉచిత కోర్సులో శిక్షణ పొందిన వీరు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. త్వరలో సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా అనలిస్ట్ కోర్సులు ప్రారంభమవుతాయని, ఆసక్తిగలవారు కళాశాల స్కిల్ సెంటర్ ఇన్చార్జ్ రసూల్ ను సంప్రదించాలని సూచించారు.