గంట ఊరిలో ఇంటిని కూల్చేసిన ఒంటరి ఏనుగు

పలమనేరు పరిధిలోని గంటావూరు వైఎస్సార్ నగర్లో ఒంటరి ఏనుగు ఇల్లు కూల్చిన ఘటన మరువకముందే, సోమవారం రాత్రి గుడియాత్తం రోడ్డులోని చిన్నకుంట-ఇంద్రానగర్ సమీపంలో రాణెమ్మ పొలం వద్ద నిర్మించుకున్న రేకుల ఇంటిపై దాడి చేసి కూల్చివేసింది. బాధితులు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. గత మూడు రోజులుగా ఈ ఒంటరి ఏనుగు పొలాలు, ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేస్తోంది. అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న ట్రాకర్స్ పై కూడా ఏనుగు తిరగబడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్