వీకోటలో తప్పిన పెను ప్రమాదం

పలమనేరు నియోజకవర్గం, వీకోట మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా స్థానిక డిసిసి బ్యాంకు వెనుక, ఆంజనేయ స్వామి గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభం రోడ్డుపై పడిపోయాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అటువైపు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్