పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదం లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపిస్తూ, వారు పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఈ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారని, ఇది మహా పాపమని నేతలు దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ అధినేతను తీవ్రంగా విమర్శిస్తూ, ఆవు లేకుండా పాలు, పాలు లేకుండా నెయ్యి, నెయ్యి లేకుండా లడ్డు తయారీ సాధ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.