28/4/26 మంగళవారము పలమనేరు నియోజకవర్గం వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సమాజంలో అశాంతి కలిగించే ప్రచారాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత లేదా అపోహలను వ్యాప్తి చేసే విషయాలను పోస్ట్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. హత్యకు గల కారణాలను విశ్లేషించి, దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేసేందుకు అన్ని కోణాలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఎస్పీ తెలిపారు.